అచ్చెన్నాయుడుకు హైకోర్టు షాక్..!

గత కొన్ని రోజులగా జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లో ముఖ్యమైన వారిని ఊహించని విధంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కితం టీడీపీ కీలక నేత మరియు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చెయ్యడం ఆ పార్టీకు మరో పెద్ద దెబ్బలా మారింది. దీనితో ఆయన అరెస్టును టీడీపీ నేతలు కుల ముద్ర వేసి ఏదో చెయ్యాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్ట్ కాబడిన అచ్చెన్నాయుడు కు ఇప్పుడు మరో షాక్ తగిలినట్టు తెలుస్తుంది. అతనికి బెయిల్ కావాలని హై కోర్ట్ లో పిటిషన్ వెయ్యగా దానిని ఏపీ హై కోర్ట్ కొట్టేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇదే కేసులో అరెస్ట్ కాబడిన రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి మరియు సుబ్బారావుల పిటిషన్ లను కూడా కొట్టివేసి వారి బైలును రద్దు చేస్తున్నట్టుగా తీర్మానం ఇచ్చి షాకిచ్చింది.

అచ్చెన్నాయుడును గత నెల పన్నెండో తేదీన నిమ్మాడలో అరెస్టు చేశారు. అచ్చెన్నకు బెయిల్ రాకపోవడంతో మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here