ఏపీకి గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో సెల్‌ఫోన్ల ప‌రిశ్ర‌మ‌లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిశ్ర‌మ‌లు పెట్టేందుకు ప‌లు కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. రాయ‌ల‌సీమ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.

విదేశీ సెల్ ఫోన్ల కంపెనీలు ఇండియాలో త‌యార యూనిట్లు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి. దీంతో ఏపీ ప్ర‌భుత్వం వీటిని ఆకర్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందుకోసం రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప జిల్లాలో ఎల‌క్ట్రానిక్ మాన్యూఫ్యాక్ష‌రింగ్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉంది. కాగా తైవాన్‌కు చెంద‌ని ప‌లు ఎల‌క్ట్రానిక్ కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని స‌మాచారం.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌డ‌ప జిల్లా కోపర్తి వ‌ద్ద 500 ఎక‌రాల్లో ఎల‌క్ట్రానిక్ మాన్యూఫ్యాక్ష‌రింగ్ క్ల‌స‌ర్ 3ని ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్ సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఇప్ప‌టికే రాష్ట్రంలో రెండు క్ల‌స్ట‌ర్స్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మరొక‌టి ఏర్పాట‌వ్వ‌నుంది. కోప‌ర్తిలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో క్ల‌స్ట‌ర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. యాపిల్‌, రెడ్‌మీ త‌దిత‌ర ఫోన్ కంపెనీలు త‌మ యూనిట్ల‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయ‌నున్నాయి. దేశంలో 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి. అయితే ఏపీ వీటిని ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here