జ‌గ‌న్ నిర్ణ‌యం క‌రెక్టేనా..

మాజీ మంత్రి, వైసీపీ నేత పెన్మ‌త్స‌ సాంబ‌శివ‌రాజు ఇటీవ‌ల మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఈయ‌న కుమారుడు పెన్మ‌త్స సురేష్‌బాబును జ‌గ‌న్ త‌న ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారు.. త‌ద్వారా పెన్మ‌త్స కుటుంబానికి త‌గిన గుర్తింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

పెన్మ‌త్స సాంబశివ‌రాజుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌తో మంచి అనుబంధం ఉంది. ఆ త‌ర్వాత వై.ఎస్ జ‌గ‌న్‌తో కూడా ఆయ‌న అలాగే మెలిగారు. ఉత్త‌రాంద్ర‌లో వైసీపీని బ‌లోపేతం చేసేందుకు పెన్మ‌త్స ఎంతో కృషి చేశారు. ఈ విష‌యాల‌న్నీ జ‌గ‌న్ గుర్తుపెట్టుకొని ఆయ‌న కుమారుడికి అవ‌కాశం క‌ల్పించారు.

ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి సురేష్‌బాబును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తూ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్‌బాబుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీఫాం అందజేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంత త్వరగా టిక్కెట్‌ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని జ‌గ‌న్‌ను క‌లిసిన అనంత‌రం సురేష్ బాబు అన్నారు. త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో త‌న‌కు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here