టిక్ టాక్ యూజ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌…

ఇండియాలో టిక్ టాక్ ఏ వింధ‌గా పాపుల‌ర్ అయ్యిందో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మారుమూల‌ ప‌ల్లెటూరిలో చిన్న పిల్లోడి ద‌గ్గ‌ర నుంచి సిటీలో ముస‌లి వాళ్ల వ‌ర‌కు అంద‌రూ టిక్ టాక్ చేసిన వాళ్లే. ఇలాంటిది ఒక్కసారిగా బ్యాన్ అవ్వ‌డంతో అంద‌రూ షాక్‌లో ఉండిపోయారు.

భారత్‌, చైనా స‌రిహ‌ద్దులో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇండియా గ‌వర్న‌మెంట్ 58 చైనా యాప్‌ల‌ను నిషేధించింది. వీటిలో టిక్ టాక్ కూడా ఉంది. జులై నుంచి టిక్ టాక్ మ‌న‌కు రావ‌డం లేదు. అయితే టిక్ టాక్ మ‌ళ్లీ వ‌స్తోంద‌ని నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో పుకార్లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ ఇది సాధ్యం కాలేదు.

ఇప్పుడు వ్యాపార దిగ్గ‌జం రిల‌య‌న్స్ సంస్థ టిక్ టాక్‌ను ఇండియా వ్యాపారాన్ని కొనేందుకు ఆస‌క్తి చూపిస్తుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. రిల‌య‌న్స్ అధినేత ముకేష్ అంబానీ అసియాలోని అప‌ర కుబేరుల జాబితాలో ఉన్నారు. ఇప్ప‌టికే జియోతో ఆయ‌న దేశంలోని మారుమూల గ్రామాల‌కు కూడా ఇంట‌ర్నెట్‌, ఫోన్ల‌ను అందించి చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు టిక్ టాక్‌ను కూడా తీసుకుంటే ఆయ‌న వ్యాపారం మ‌రింత అభివృద్ది చెందుతుంది.

అయితే టిక్‌టాక్ రిల‌య‌న్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని పుకార్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ విష‌యంపై మాట్లాడేందుకు రియ‌ల‌న్స్ వ‌ర్గాలు ఆస‌క్త చూప‌లేదు. ప్రారంభ ద‌శ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి. జులైలో చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఇంకా ఫైన‌ల్ కాలేద‌న్న‌ట్లుగా స‌మాచారం. ఇదే నిజ‌మైతే కోట్లాది మంది టిక్ టాక్ అభిమానులు పండ‌గ చేసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here