ఇండియాలో అక్ష‌య్‌కుమార్ నెంబ‌ర్ వ‌న్‌.

బాలివుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ రికార్డు సృష్టించారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంప‌న్న న‌టుల‌ జాబితాలో అక్ష‌య్ కుమార్ చోటు ద‌క్కించుకున్నారు. ఇండియాలో ఏ న‌టుడికి స్థానం ద‌క్క‌లేదు ఒక్క అక్షయ్ కుమార్‌కు త‌ప్ప‌.

అక్ష‌య్ కుమార్ ఆదాయం 48.5 మిలియ‌న్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీ ప్ర‌కారం రూ. 363 కోట్లు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక ఆదాయం తీసుకుంటున్న సెల‌బ్రెటీల టాప్ 10 జాబితాను ఇటీవ‌ల ఫోర్బ్స్ విడుద‌ల చేసింది. ఇందులో భార‌త్ నుంచి అక్ష‌య్ కుమార్ ఒక్క‌రే ఉన్నారు. ఇక ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో హాలివుడ్ న‌టుడు డ్వేన్ జాన్స‌న్ 87.5 మిలియ‌న్ డాలర్ల‌తో ఉన్నారు.

ఈయ‌న లాస్ట్ ఇయ‌ర్ కూడా మొద‌టి స్థానంలోనే ఉండ‌గా.. అక్ష‌య్ కుమార్ గ‌తేడాది నాలుగో స్థానంలో ఉండి ఈ సారి రెండు పాయింట్లు త‌గ్గి ఆరో స్థానంలో ఉన్నారు. ఇక అక్ష‌య్ కుమార్ అమేజాన్ ప్రైమ్ సిరీస్ ది ఎండ్ షోలో న‌టిస్తున్నారు. ఇందుకోసం అక్ష‌య్ ప‌ది మిలియ‌న్ డాల‌ర్లు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అక్షయ్ సినిమాల కంటే యాడ్స్ ద్వారానే అత్య‌ధిక ఆదారం ఆర్జిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here