ఉగాది రోజున ‘నేల టికెట్’ ఫస్ట్ లుక్

రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నేల టికెట్’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రవితేజ సినిమా టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమాతో విజయం సాధించాలని బాగా కష్టపడుతున్నాడు రవితేజ.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉగాది రోజున విడుదల చేయాలనీ టీమ్ భావిస్తోందట. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల చేస్తారని తెలిసింది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తారట. మాస్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఊర్రా మాస్ తరహాలో కనిపిస్తాడని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here