వరుస సినిమాలతో బిజీ హీరో అయిన నాగ చైతన్య

ఇండస్ట్రీలో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే మారుతి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న నాగచైతన్య ఇటీవల నాని హీరోగా నిన్ను కోరి సినిమా తీసినా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన సరసన సమంత నటించనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఓ కొత్త దర్శకుడికి చైతూ ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ .. తన పాత్ర నచ్చడంతో చైతూ మంచి ఉత్సాహాన్ని చూపించాడని అంటున్నారు. అయితే ఈసినిమాను తన స్వంత బ్యానర్ అన్నపూర్ణ బ్యానర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here