నయనతార సినిమాకు ఏ సర్టిఫికెట్!!

మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్.. లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకు కోలీవుడ్ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. హరీష్ ఉత్తమన్ మేల్ లీడ్ గా నయనతార పక్కన యాక్ట్ చేసిన డోర సినిమా.. ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఇంతలో.. సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందన్న విషయం జనాల్లోకి వెళ్లింది. దీంతో.. నయన్ అభిమానులు చాలా ఆత్రంగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో.. నయన్ ఏ స్థాయిలో అందాలు ఆరబోసిందో అని రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

ఇంతలో.. నయన్ కు సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేష్ శివ.. సెన్సార్ బోర్డు తీరుపై విపరీతంగా రియాక్ట్ అయ్యారు. చాలా సినిమాలకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్న సెన్సార్ బోర్డు.. డోర సినిమాకు మాత్రం ఏ సర్టిఫికెట్ ఇవ్వడం సరికాదంటూ సీరియస్ అయ్యారు. దీంతో.. ఈ సినిమాలో ఇంకేదో ఉందన్న ప్రచారం ఇంకా విపరీతంగా జరుగుతోంది. అంతే కాక.. ఇప్పటికే నయన్ కు సన్నిహితుడుగా విఘ్నేష్ పై ఉన్న ప్రచారం.. ఈ కామెంట్లతో కన్ఫమ్ అయినట్టే అన్న మాట కూడా వినిపిస్తోంది.

ప్రచారానికి తగ్గట్టే.. నయనతార ఈ సినిమాలో అందంగా కనిపిస్తుందా.. అభిమానులను అలరిస్తుందా.. లేదంటే.. ఇదంతా సినిమా కోసం జరుగుతున్న ప్రచారమా..? ఇందులో ఏది నిజమో చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here