సావిత్రి సినిమా అంటే తమిళ హీరో సూర్య భయపడుతున్నాడు

మహానటి సావిత్రి జీవితం అంటే అన్నీ సంచలనాలే. ఆమె సినిమాల్లోకి రావడం వివాదమే , ఆమె సినిమాలు మానడం వివాదమే , ఆమె పెళ్లి , ప్రేమ , చావూ అన్నీ వివాదాలు గానే గడిచాయి. ఆమె మీద సినిమా అంటేనే వివాదం , సంచలనం అవుతుంది అనడం లో అతిశయోక్తి లేదు. ఈ కాలం జనాలకి తెలీదేమో కానీ సావిత్రి జీవితం లో ఎన్నెన్నో మలుపులు ఉన్నాయి. డైరెక్టర్ నాగ అశ్విన్ మహా నటి సావిత్రి జీవితాన్ని తెరకి ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితం లో ఒడుదుడుకులు అన్నీ తెరమీద చూపించడానికి ఈ కుర్ర డైరెక్టర్ సిద్దం అయ్యాడు. మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ సినిమాని తీస్తున్నారు.

మహానటి పాత్ర లో కీర్తి సురేష్ , జమున గా సమంత ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళుతుంది. సావిత్రి నిజ జీవితం కేవలం తెలుగు బాష కే పరిమితం కాదు , తమిళం లో కూడా ఆమె టాప్ హీర్పినే గ రాజ్యం ఏలింది. రెండు భాషాలకి తెలిసిన సురేష్ కీర్తి ని ప్రధాన పాత్రలో పెట్టుకున్న అశ్విన్ శివాజీ గనేషన్ కోసం సూర్య ని కలిసాడట . స్టోరీ మొత్తం చెప్పి ఒక వివాదాస్పద రోల్ చెయ్యాలి అని సూర్యని కోరాడట. సూర్యా ఇంకా తన నిర్ణయం చెప్పాల్సి ఉంది. శివాజీ గణేషన్ పాత్ర చేస్తే తమిళనాడు లో విపరీతమైన నెగెటివ్ , గొడవలు జరుగుతాయి అతని ఇమేజ్ కూడా భంగ పడుతుంది అందుకే సూర్య భయపడుతున్నాడు అనే టాక్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here