బాలయ్య 102 సినిమా స్టోరీ లీక్..బాల‌య్య త‌ల్లి న‌య‌నతార‌న‌..?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ 102 సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతుంది. ఈ సినిమా సంబంధించిన స్టోరీ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట్లో చ‌క్కెర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాల‌య్యకు త‌ల్లిగా న‌య‌న‌తార యాక్ట్ చేస్తుండ‌గా, మలయాళ నటి నటాషా ఆయన సరసన హీరోయిన్ గా చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ లీకైన స్టోరీ బ‌ట్టి బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌య‌న హీరోయిన్ అని , న‌ట‌షా కూతురని ప్ర‌చారం.
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా లో బాల‌య్య‌, న‌య‌న‌తార‌లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌ర‌ప‌డం, అవి జ‌ర‌గ‌క‌పోగ విడిపోతారు. అయితే తాను గాఢంగా ప్రేమించే ప్రియురాలు ఎక్క‌డ ఉందోనని బాల‌య్య వెతికేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతాడు. అలా 20సంవ‌త్స‌రాల బ్యాక్ డ్రాప్ త‌రువాత న‌య‌న‌కు పెళ్లై…న‌టాషా పుడుతుంది. పాత‌కక్ష్య‌ల‌తో వీరిద్ద‌రిని మ‌ట్టుపెట్టేందుకు విల‌న్ దాడి చేస్తాడు. ఈ క్ర‌మంలో త‌న ప్రియురాల‌కోసం అన్వేష‌ణ‌లో ఉన్న బాల‌య్య‌కు న‌టాషా ఎదురుప‌డుతుంది. త‌న‌కు ఎవ‌రు లేర‌ని శ‌త్రువుల‌నుంచి కాపాడాల‌ని కోర‌గా విలన్ల బారి నుంచి ఆమెను ఆయన రక్షిస్తాడు.
ఇది స్టోరీ…
అంతేకాదు ఇందులో మ‌రికొన్ని ట్విస్ట్ లు టన్నుల‌కొద్ది ఉన్నాయ‌ట‌. మునుపెన్న‌డు లేని విధంగా ఈ సినిమాలో బాల‌య్య కొత్త‌గా క‌నిపించేలా  డైర‌క్ట‌ర్ కేఎస్. ర‌వికుమార్ తీర్చిదిద్దినట్లు గుస‌గుస‌. ఏ గుస‌గుస ఎలా ఉన్నా సినిమా విడుద‌లైతే కానీ స్టోరీ అదేనా లేదా ఇంకా కొత్త‌గా ఉన్న‌ది తెలియాలంటే చిత్రం విడుదల వరకు వేచి ఉండాల్సిందే. కాగా మరో వైపు ఈ చిత్రానికి జయసింహ అనే టైటిల్ పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here