ప‌వ‌న్ సినిమా, చ‌ర‌ణ్ సినిమాలు విడుద‌ల కాక‌పోతే బాగుండు

రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ఒక‌రిపై ఒక‌రు యుద్ధం ప్ర‌క‌టించుకున్నారు. ఆ యుద్ధంలో ఎవ‌రు గెలుస్తారో..ఎవ‌రు డ్రాప్ అవుతారో తెలియాల్సి ఉంది. అబ్బాయి రాంచ‌ర‌ణ్, బాబాయి ప‌వ‌న్ క‌ల్యాణ్ సంక్రాతి బ‌రిలో ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డ‌నున్నారు. చ‌ర‌ణ్ సుకుమ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రంగ‌స్థ‌లం సినిమా చేస్తుండ‌గా..త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో దిగ‌నున్నాయి.  కానీ ఈ సినిమాలు విడుద‌ల కాక‌పోతే మంచిద‌ని, లేదంటే మెగా  ఫ్యామిలీ ప‌రంగా ఇబ్బందులు తలెత్తే అవ‌కాశాలు ఉన్నాయని క్రిటిక్స్ అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుద‌లవుతున్నాయంటే పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది. దీంతో బాక్సాఫీస్ లో ఎవ‌రో ఒక‌రు విజేత‌గా నిలుస్తారు. మ‌రి ఆ విజేత ప‌వ‌న్ అయితే బాబాయి, అబ్బాయికి మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌స్తాయ‌ని, కాబ‌ట్టి ఎవ‌రో ఒక‌రు త‌మ సినిమా విడుద‌ల వాయిదా వేస్తే బాగుంటుంద‌ని ఇటు చ‌ర‌ణ్ అభిమానులు, అటు ప‌వ‌న్ అభిమానులు కోరుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here