తెలుగు బిగ్ బాస్ షో పైనల్ కు చేరుకుంది. ఫైనల్ ల్లో ఆదర్ష్ బాలకృష్ణ, అర్చన, శివబాలాజీ, నవదీప్, హరితేజలు మిగిలిపోయారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఉత్కంఠతకు తెరదించుతు శివబాలాజీయే విజేత అని తెలుస్తోంది. దీనికి పరోక్షంగా పవన్ కల్యాణ్, పవన్ అభిమానులని సమాచారం. ఎందుకంటే పవన్ అమితంగా ఇష్టపడే వ్యక్తుల్లో శివబాలాజీ ఒకరు. సినిమాల్లో అవకాశాలు కానీ, బాలాజీ ప్రేమ వ్యవహారం లో అండగా ఉండి పెళ్లి చేయడం లాంటి కారణాలు చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంచితే బాలాజీ వివాదాలకు దూరంగా ఉండడం. బిగ్ బాస్ లో తన మేట్స్ ఫ్రెండ్లీ నేచర్ తో షోను సజావుగా సాగించడం ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక బిగ్ బాస్ లో విజేతకు ఓటింగ్ కు ఆహ్వానించారు. ఓటింగ్ లో శివబాలాజీకి మద్దతుగా ఓటింగ్ చేయాలని పవన్ కల్యాణ్, అభిమానులు అనుకుంటున్నారట.
