న‌రేంద్ర‌మోదీ మాస్క్ పెట్టుకోలేదు..

క‌రోనా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నిబంధ‌న‌లు జారీ చేసింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ విష‌యంలో ప్ర‌త్యేక చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం మోదీ ఎన్నోసార్లు ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఓ స్టాల్ వద్ద ఉన్న వస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఇంతలో స్టాల్ ఏర్పాటు చేసిన వ్యక్తి, మోదీకి మాస్క్ ఇచ్చారు. మోదీ వద్దని చెప్పారు. అయినా అతను మళ్లి ఇవ్వడానికి ప్రయత్నించారు. మోదీ తనకు వద్దని సైగ చేస్తూ స్టాల్‌లో ఉన్న వస్త్రాలను చూస్తున్నారు. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ పదునైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో సైతం బీజేపీ ఐటీ సెల్‌కు గట్టి పోటీ ఇస్తుంది ఆప్‌.

ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘‘దయచేసి మోదీలా ఎవరూ చేయకండి, మాస్క్‌ తప్పని సరిగా పెట్టుకోండి’’ అంటూ రాసుకొచ్చారు. మ‌రి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు క‌రోనా నిబంధ‌న‌ల గురించి మోదీ ఎన్నో విష‌యాలు చెప్పారు. అలాంటిది ఆయ‌న ఎందుకు మాస్క్ పెట్టుకోలేదో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here