కామెడీలో బ్రహ్మానందానికి పోటీగా నారాలోకేష్

ఫిల్మిం ఇండస్ట్రీకి , ఏపీ పాలిటిక్స్ కు కొత్త కమెడియన్ దొరికాడని సోషల్ మీడియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడంలో విఫలమవుతున్నా బ్రహ్మానందాన్నిరిప్లేస్ చేయడానికి నేనున్నాంటూ ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్ రంగంలోకి దిగారని సెటైర్లు వేస్తున్నారు. మాటల్ని తూటాల్లా ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకునే రాజకీయనాయకులకు చినబాబు కామెడీతో కాస్త రిలాక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఏ మూహుర్తంలో పాలిటిక్స్ ఎంటర్ అయ్యాడో..అప్పటినుంచి కామెడిని అభిమానించే ప్రేక్షకులు లోకేష్ బాబుకు బ్రహ్మరథంపడుతున్నారు.
బ్రహ్మానందానికి ఎక్కువ..మంత్రికి తక్కువ అంటూ సోషల్ మీడియాలో కార్టున్, క్లిప్ లు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇలా నారావారబ్బాయి లోకేశ్‌ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు . అక్కడ ప్రసంగిస్తూ.. అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అని చెప్పి నాలుక్కరుచుకున్నారు. పక్కనే ఉన్న కొంతమంది వర్ధింతి కాదు సార్..జయంతి అని చెప్పడంతో ఏంచేయాలో పాలుపోక సారీ అంటూ అంబేదర్కర్ జయంతి అని ఉచ్చరించారు.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనూ లోకేష్ ప్రసంగంలో తప్పు దొర్లింది. శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారు.  గతంలో టీడీపీ ప్రచార సభల్లోనూ.. లోకేశ్ టంగ్ స్లిప్పయ్యారు. ఏదో మాట్లాడాలన్న తొందరలో.. తెలియకుండానే సొంత పార్టీ పైనే సైటైర్లు వేశారు. ఇలా ప్రతీసారి టంగ్ స్లిప్ అవ్వడంపై తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. తమనాయకుడు నిప్పు కాస్త పప్పు అయ్యారని బెంగపెట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here