ఆయ‌న‌పై క‌క్ష్య సాధిస్తున్నారన్న లోకేష్‌

ఏపీ సీఎం వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టిడిపి నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌పై క‌క్ష్య సాధించేందుకే జ‌గ‌న్ సీఎం అయ్యార‌న్నారు.

ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ ఒక్క చాన్స్ అడిగింది ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసేందుకు అన్నారు లోకేష్‌. తెలుగుదేశం పార్టీ నేత జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డికి క‌రోనా సోకేందుకు వై.ఎస్ జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వ‌మే కార‌ణ‌మ‌న్నారు. బెయిల్‌పై విడుద‌లయిన జేసిని మ‌ళ్లీ 24 గంట‌ల్లోపే అరెస్టు చేశార‌న్నారు. క‌డ‌ప జైల్లో ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌టం బాధాక‌ర‌మ‌ని లోకేష్ ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌న్నారు.

రాష్ట్రంలో క‌రోనా, వ‌ర‌ద‌లు విజృంభిస్తుంటే జ‌గ‌న్ మాత్రం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై ప‌డ్డార‌న్నారు. వారి అక్ర‌మ అరెస్టుల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నార‌న్నారు. క‌క్ష్య సాధించేందుకే జేసీ కుటుంబంపై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని లోకేష్ అన్నారు. క‌డ‌ప జైల్లో ఉన్న ఖైదీల‌కు క‌రోనా సోకింద‌న్నారు. త‌క్ష‌ణ‌మే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆయ‌న కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here