ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ఫేస్‌బుక్ క్లారిటీ..

ఎవ‌రైనా వార్త‌ల్లోకెక్కాలంటే సామాజిక మాధ్య‌మాలను ఎంచుకుంటారు. కానీ ఈమ‌ధ్య‌ సామాజిక మాధ్యమం దిగ్గ‌జం ఫేస్‌బుక్ కూడా త‌ర‌చూ వార్త‌ల్లోకెక్కుతోంది.

ఇండియాలో బీజేపీకి అనుకూలంగా ఫేస్‌బుక్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఈ మ‌ధ్య వార్తలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈవిష‌యంలో ఫేస్‌బుక్ స్పందించింది. ఎవ్వ‌రికీ అనుకూలంగా తాము వ్య‌వ‌హ‌రించ‌మ‌ని.. నియ‌మ‌, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే త‌మ సంస్థ ప‌నిచేస్తుంద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఫేస్‌బుక్ మ‌రో వివాదంలో ప‌డింది.

బ్లాక్‌లైవ్స్ మ్యాట‌ర్స్ ఉద్య‌మం గురించి అమెరికా అద్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ గ‌తంలో ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.  ఈ వ్యాఖ్య‌లు ఫేస్‌బుక్ తొల‌గించ‌లేదు. దీంతో దీనిపై తీవ్రంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా ఫేస్‌బుక్ సీఈఓ షెరిల్ సాండ్‌బెర్గ్ స్పందించారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేని వ్యాఖ్య‌ల‌ను తొల‌గిస్తామ‌న్నారు. అది అమెరికా అద్య‌క్షుడైనా తొల‌గిస్తామ‌న్నారు.

క‌రోనా వైర‌స్‌, ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌మ‌సంస్థ ప్ర‌మాణాల‌కు విరుద్ధంగా స‌మాచారం షేర్ చేస్తే దానికి ఫేస్‌బుక్‌లో స్థానం ఉండ‌ద‌న్నారు. దీంతో ఫేస్‌బుక్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కిన‌ట్లు అయ్యింది. మొత్తం మీద ఫేస్‌బుక్‌లో షేర్ చేసేట‌పుడు నిబంధ‌న‌లు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here