ఐపిఎల్ స్పాన్స‌ర్‌షిప్‌గా డ్రీమ్ 11 కొన‌సాగుతుందా…

ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్‌గా డ్రీమ్ 11 ద‌క్కించుకున్న కొద్ది గంట‌ల్లోపే దీనిపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. చైనా వ్యాపార‌స్తులు ఇందులో పెట్టుబ‌డులు పెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఎక్కువ‌వుతున్నాయి.

వివో ఐపిఎల్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి వైదొలిగిన త‌ర్వాత ఎట్ట‌కేల‌కు డ్రీమ్ 11 స్పాన్స‌ర్‌షిప్‌ను ద‌క్కించుకుంది. అయితే ఆ సంతోషం ఈ సంస్థ‌కు కొద్ది గంట‌లు కూడా మిగ‌ల‌లేదు. వెనువెంట‌నే ఈ సంస్థ‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయంటూ వ్య‌తిరేక‌త వ‌స్తోంది. దీనిపై అఖిల భార‌త వ్యాపారుల స‌మాఖ్య బీసీసీఐకి లేఖ రాసింది.

డ్రీమ్ 11లో చైనా పెట్టుబ‌డులు ఉన్నాయంటూ స‌మాఖ్య బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీకి లేఖ రాశారు. చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ సంస్థ ముఖ్య‌మైన వాటాదారు అని పేర్కొంది. ఏ చైనా వ‌స్తువ‌లైతే బ‌హిష్క‌రించామో మ‌ళ్లీ ఇప్పుడు డ్రీమ్ 11కు స్పాన్స‌ర్‌షిప్ ఇస్తే భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌డ‌మే అని లేఖ‌లో తెలిపింది.

ఇక వ‌చ్చే నెల‌లో దుబాయ్‌లో ఐపిఎల్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. మ‌రి డ్రీమ్ 11 ఇప్ప‌టికే స్పాన్స‌ర్‌షిప్ ద‌క్కించుకుంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో డ్రీమ్ 11 స్పాన్స‌ర్‌షిప్‌ను కొన‌సాగిస్తారా లేదా వ‌దులుకుంటారా అన్న‌ది మాత్రం తెలియ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here