ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ విశాఖ‌లో.. ప్ర‌ణాళిక‌లు సిద్ధం..

విశాఖ‌లో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం భారీ స్థాయిలో చేప‌ట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. 30 ఎక‌రాల్లో దీన్ని నిర్మించేందుకు అధికారులు చ‌క‌చ‌కా ముందుకు సాగుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అతిథి గృహాన్ని విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేహౌండ్స్ కొండ‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం 30 ఎక‌రాలు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ప్రీబిడ్ స‌మావేశం కూడా నిర్వ‌హించారు.

విశాఖ ఎయిర్‌పోర్టుకు ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ మ‌హాప్రాంత అభివృద్ధి సంస్థ‌(వీఎంఆర్‌డీఏ) ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇది జ‌రుగుతోంది. గెస్ట్ హౌస్ ఏ విధంగా ఉండాల‌న్న దానిపై చ‌ర్చించారు. ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌, నిర్మాణ ఆకృతులు, త‌దిత‌ర విష‌యాల‌న్నింటిపై ప‌లు ఆస‌క్తిగల సంస్థ‌ల నుంచి ప్ర‌తిపాద‌న‌లు కోరుతున్నారు.

రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు, ముఖ్య‌మంత్రులు, కేంద్ర‌మంత్రులు, ఇత‌ర ప్ర‌ముఖులు రాష్ట్రానికి వ‌చ్చిన స‌మ‌యంలో త‌గిన ర‌క్ష‌ణ ప్ర‌మాణాల‌తో వ‌స‌తి ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్రైవేటు హోట‌ళ్ల‌లో వ‌స‌తి క‌ల్పిస్తున్నారు. అయితే ఖ‌ర్చు ఎక్కువ అవుతుండ‌టంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో కొత్త అతిథి గృహాలు నిర్మించాల‌ని భావిస్తోంది.

ఇందులో భాగంగానే విశాఖ‌లో ఈ కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణం జ‌రుగుతోంది. నిర్మాణ సంస్థతో ఒప్పందం పూర్తి చేసుకొని మ‌రో నెల రోజుల్లో ప‌నులు ప్రారంభించాల‌ని అధికారులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానికిగా ప్ర‌భుత్వం విశాఖ‌ను నిర్ణ‌యించిన నేప‌థ్యంలోనే ఇలా హంగుల‌తో ప్ర‌భుత్వ అతిథిగృహం నిర్మిస్తున్నారని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here