నాని వి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

హీరో నాని ట్రెంట్ సెట్ చేయబోతున్నాడు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త అధ్యాయాన్ని నాని ద్వారా లిఖింన‌ట్లైంది. క‌రోనాతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓటీటీ స‌రైన మార్గ‌మ‌ని ప‌లువురికి దారి చూపించారు నాని.

హీరో నానితో ద‌ర్శ‌కుడు ఇంద్ర‌కంటి మోహ‌న్ కృష్ణ వి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత‌. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని విడుద‌ల చేసేలోపే క‌రోనా లాక్‌డౌన్ వ‌చ్చేసింది. దీంతో అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తామా అన్న ఉత్కంఠ‌త‌తో మూవీ యూనిట్ ఉంది.

మొత్తానికి ఓటీటీ ద్వారా సినిమాను రిలీజ్ చేయాల‌ని భావించిన చిత్ర బృందం అమేజాన్ ప్రైమ్ ద్వారా సెప్టెంబ‌ర్ 5వ తేదీన మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముందు నుంచీ అమేజాన్ ప్రైమ్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని బ‌య‌ట‌కు తెలిసినా ఎక్క‌డా దీన్ని దృవీక‌రించ‌లేదు. ఫైన‌ల్‌గా సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించడంతో నాని అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగులో ఓ పెద్ద సినిమా ఓటీటీ ద్వారా విడుద‌ల‌కు రెడీ అవ్వ‌డం ఇదే ప్ర‌థ‌మం. వీ సినిమా త‌ర్వాత ఇక ధైర్యంగా సినిమాలు ఓటీటీ వేదిక‌గా విడుద‌ల చేస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక నాని సినిమా మ‌రో రెండు వారాల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here