కోర్టును ఆశ్ర‌యించిన రెండో త‌ర‌గ‌తి బాలిక‌..

రెండో త‌ర‌గ‌తి బాలిక కోర్టును ఆశ్ర‌యించింది. మ‌న ప్రాంతంలో కాదు త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరువ‌ళ్లూరు జిల్లాలో ఇది చోటుచేసుకుంది.

పాఠ‌శాల‌లో వ‌స‌తుల కోసం విద్యార్థి సంఘాలు ధ‌ర్నాలు చేయ‌డం మ‌నం చూస్తుంటాం. కానీ తిరువ‌ళ్లూరు జిల్లా మీంజూరు గ్రామంలో ఓ ఏడేళ్ల పాప ఈ పోరాటంలో కీల‌క పాత్ర పోషించింది. ముత్త‌రసి అనే ఏడేళ్ల బాలిక మీంజూరు ప్ర‌భుత్వ పాఠశాల‌లో 2వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. పాఠ‌శాల‌లోని గోడ‌లు కొంచెం బీట‌లు వారాయి. దీంతో ఆందోళ‌న‌కు గురైన  ఈ చిన్నారి త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యం తెలియ‌జేసింది.

ఆ త‌ర్వాత పాఠ‌శాల‌లో ప్ర‌ధానోపాద్యాయుడు, క‌లెక్ట‌ర్ దృష్టికి విష‌యం వెళ్లేలా ప్ర‌య‌త్నించింది. అయినా కూడా ఈ స‌మ‌స్య పట్ల ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో చేసేదేమీలేక త‌న తండ్రి స‌హాయంతో హైకోర్టులో పిటిష‌న్ కూడా వేసింది. దీనిపై విచారించిన ధ‌ర్మాస‌నం ఆరు నెల‌ల్లో పాఠ‌శాలల్లో మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టాల‌ని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మీంజూరు పోలీసులు కూడా ముత్త‌ర‌సిని పోలీస్ స్టేష‌న్‌కు రావాల‌ని నోటీసులు ఇచ్చారు.

ఇంత చిన్న వ‌య‌స్సు పాప‌కు నోటీసులు రావ‌డంపై అంద‌రూ షాక్ అయ్యారు. వ‌య‌స్సు చిన్న‌ద‌యినా పోరాటం పెద్ద‌గా చేసింద‌ని చాలా మంది అభినందిస్తున్నారు. జిల్లాలో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ‌య‌స్సులోనే ఇలా పోరాటం చేసిందంటే పెద్ద‌య్యాక ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ లాగా పోరాడుతుంద‌ని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here