నాని ‘వి’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది..

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘వి’. బుధవారం ‘వి’ ట్రైలర్‌ని నాని ట్విటర్‌లో విడుదల చేశారు. అంచనాలకు తగ్గట్టుగా సినిమా ట్రైలర్‌ అదిరింది . నాని, సుధీర్‌బాబు మధ్య యాక్షన్‌ సీన్స్‌ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా వయెలెంట్‌గా ఉండనుందని ట్రైలర్‌లో నాని డైలాగ్స్‌ని బట్టి అర్థమవుతోంది. నివేదా థామస్, అదితీ రావ్‌ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్‌’రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ రెడ్డి సినిమాని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here