నాగ‌శౌర్య ఫ‌స్ట్‌లుక్.. అప్పుడే కామెంట్ చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల.

హీరో నాగ‌శౌర్య కొత్త గెట‌ప్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. కొత్త సినిమా కోసం ఆయ‌న మారిన స్టైల్ ఇప్పుడు యువ‌త‌లో క్రేజీగా ట్రెండ్ అవుతోంది. యంగ్ హీరోల్లో సైతం నాగ‌శౌర్య గురించే డిస్క‌ర్ష‌న్‌.

సంతోష్ జాగ‌ర్ల‌పూడి డైరెక్ట‌ర్‌గా నాగ‌శౌర్య ఓ సినిమా తీస్తున్నారు. విలువిద్య నేప‌థ్యంలో సాగే క‌థతో ఇది తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను మొన్న చిత్ర‌బృందం రిలీజ్ చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. నాగ‌శౌర్య కొత్త గెట‌ప్‌లో కనిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు.

తాజాగా ఇప్పుడు సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన అనంత‌రం డైరెక్ట‌ర్ శేఖ‌ర్ కమ్ముల మాట్లాడుతూ నాగ‌శౌర్య శ‌రీరాకృతిని మార్చుకున్నారు. సిక్స్‌ప్యాక్‌తో ఒక వారియ‌ర్‌లా నాగ‌శౌర్య ఉన్నార‌న్నారు. గ‌తానికి విభిన్నంగా నాగ‌శౌర్య సినిమాలో క‌నిపించ‌బోతున్నార‌న్న‌ది ఫోటో చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. మ‌రి సినిమా ఏ విధంగా ఉంటుందో చూద్దాం మ‌రి.

యంగ్ హీరో నాగ‌శౌర్య ఫోటో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here