నాన్న ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అని నాగ చైతన్య ఫీల్ అవుతున్నాడు

ఈ కాలం కుర్రాళ్ళు చాలా ఫాస్ట్ అండీ అంటూ ఉంటారు పెద్దోళ్ళు .. నాగార్జున కొడుకు నాగ చైతన్య కూడా కుర్రాడే కదా . తండ్రి తో ఒక్క మాట కూడా చెప్పకుండా శుబ్రంగా ప్రేమించాడు, అది కూడా హీరోయిన్ ని. నాగార్జున ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు సినిమాల విషయం లో కూడా ఒకరకమైన సొంత నిర్ణయాల వైపు నాగ చైతన్య వెళ్ళాలి అనుకోవడం వెనకాల నాగార్జున అడ్డుకుంటూ సజెషన్ లు ఇవ్వడం ఇవన్నీ నాగ చైతన్య కి నచ్చడం లేదు అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తో ఇవాళ ఉగాది సందర్భంగా ఫాన్స్ ని ఆశ్చర్యపరచాలి అని నాగ చైతన్య ప్లాన్ చేసాడు. ఈ ఫస్ట్ లుక్ విషయం లో నాగ చైతన్య ఒక ట్వీట్ వేసాడు .. ” ఫస్ట్ లుక్ విషయం లో డైరెక్టర్ , నిర్మాత ఒక అగ్రిమెంట్ కి రాలేకపోతున్నారు . రెండు ఫస్ట్ లుక్ లు విడుదల చేస్తాం” అని నాగ చైతన్య ట్విట్టర్ లో రాసాడు.

నాగార్జున ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాగా కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. సాధారణంగా ట్విట్టర్ లో తన పోస్ట్ లు మాత్రమే పట్టించుకునే నాగార్జున దీనికి మాత్రం రిప్లయ్ ఇచ్చాడు. ఎవరు కరక్ట్ అన్నది రేపు తెలుస్తుంది లే అంటూ సాగింది అతని ట్వీట్ . నాగార్జున ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండడం నాగచైతన్య కి అస్సలు నచ్చడం లేదట. సినిమా విషయం లో తనకి పర్సనల్ గా చెప్పడం వేరు ఇలా పబ్లిక్ లో రాయడం ఏంటి అని బాధపడుతున్నాడు చైతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here