డిజాస్టర్ బ్రూస్లీ తరవాత చిరు – వైట్ల మళ్ళీ కలుస్తున్నారు !

తన నూటయాభయ్యవ సినిమా కంటే ముందే చిరు సరదా ఎంట్రీ తో బ్రూస్ లీ సినిమాలో కనిపించాడు . తన కొడుకు హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన బ్రూస్ లీ లో చిరు ఆఖర్లో వచ్చి హీరోయిన్ ని కాపాడి విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఈ సినిమాలో ఆయన ఇచ్చి కామియో అదుర్స్ అన్నారు అందరూ. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఊహలతో డిజాస్టర్ అయ్యింది. మగధీర లో తన కామియో తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తన కొడుకు బ్రూస్ లీతో కనీసం బ్లాక్ బస్టర్ అవుతున్నాడు అనుకున్నాడు చిరు. కానీ శ్రీను వైట్ల పేలవమైన టేకింగ్ తో ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి కూర్చుంది. బ్రూస్ లీ సినిమా దెబ్బ ఎంత గట్టిది అంటే ఈ సినిమా వలన రామ్ చరణ్ కెరీర్ డైలమా లో పడిపోయింది. ఇక అతని కెరీర్ దాదాపు ముగిసిపోయింది అన్నారు చాలా మంది .

కానీ నెమ్మదిగా పుంజుకున్నాడు రామ్ చరణ్ .. అయితే శ్రీను వైట్ల చాలా గ్యాప్ తరవాత మిస్టర్ అనే సినిమాని వరుణ్ తేజ్ తో ప్లాన్ చేసి విడుదల కి సిద్దం చేసాడు. ఈ సినిమా ఆడియో వేడుక లో చిరంజీవి ముఖ్య అతిధి గా రాబోతూ ఉండడం తో ఈ ఆడియో వేడుకలో చిరు ఎలా మాట్లడతారు అనేది ప్రధాన అంశంగా మారింది. ముప్పై న అంటే రేపు జరగబోతున్న ఈ ప్రోగ్రాం లో తన కొడుకు కెరీర్ ని దాదాపు ముగించేసిన శ్రీను గురించి చిరు తన కోపం చూపిస్తారా ? కవర్ చేస్తూ మాట్లాడతారా అనేది ఆసక్తికరం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here