తమ వంశం లో ‘నాగ’ అనే పేరు కి ఉన్న సీక్రెట్ చెప్పిన నాగార్జున

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని అంటే ఒక బ్రాండ్ అలాగే ప్రత్యేక గుర్తింపు కలిగిన  ఫ్యామిలీ అన్ని చెప్పవచ్చు. ప్రస్తుతం అక్కినేని వారి కుటుంబం అక్కినేని అఖిల్ ను హలో సినిమా ద్వార రీలాంచ్ చేయబోతున్నరు ..కనుక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో  చురుగ్గా పాలుపంచుకుంటున్నారు అక్కినేని కుటుంబం వారు. ఈ విధంగా సినిమా స్థాయిని పెంచుతూ ఎక్స్ పెక్టేషన్ లు కూడా ఎక్కువ చేస్తున్నాడు నాగ్ . హీరో నాగార్జున అలాగే వారి సోదరి నాగ సుశీల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ కుటుంబం గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలో నాగార్జున – నాగసుశీల అనే పేర్లు ఎలా వచ్చాయి అనే దానిపై నాగ్ వివరణ ఇచ్చాడు. నాగ్ మాట్లాడుతూ.. నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) నానమ్మ కడుపులో ఉన్నపుడు ఒక చిన్న నాగుపాము కలలోకి వచ్చిందట. అయితే నాన్న జన్మించిన తర్వాత ఇంకా పేరు పెట్టలేదట. ఒక రోజు పాలు ఇస్తుంటే.. సడన్ గా నాగుపాము మళ్లీ కనిపించడంతో నాగేశ్వరరావు అని పేరు పెట్టారని.అలాగా నాగ్  అనే పేరు కంటిన్యూ అయిందని నాగార్జున తెలిపారు. ” అప్పటి నుంచీ మా ఫామిలీ లో చాలా వరకూ ఈ నాగ అనే పేరు పెట్టుకుంటూ వచ్చాము. ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఇది సాగుతుంది కావచ్చు ” అంటూ వివరించాడు నాగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here