బాలయ్య మొత్తానికి రంగంలోకి దిగాడండోయ్ .. ఫుల్ ఖుషీ లో ఫాన్స్ .

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎన్నటికీ విడదీయలేనివి అటువంటి కాంబినేషన్లో వస్తే సినిమా కథ ఎలా ఉన్న బొమ్మ మాత్రం హిట్ కొట్టాల్సిందే.అటువంటి కాంబినేషన్లో  నందమూరి బాలకృష్ణ, నయనతారల కాంబినేషన్ కోడా ఒకటి . వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు సింహ , శ్రీరామరాజ్యం బాక్సాఫీస్ దగ్గర వసూలు బాగానే రాబటుకున్నాయి .ప్రస్తుతం వీరిద్దరూ జై సింహా అనే సినిమా లో నటిస్తున్నారు . అయితే ఈ చిత్రం ఆడియోను విజయవాడలోని వజ్ర  గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని  ప్లాన్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ చెబుతున్న దాని ప్రకారం న భూతో న భవిష్యత్ అన్న చందంగా ఈ సినిమా ఆడియో చెయ్యబోతున్నారు. .చిరంతన్ బట్ సంగిత దర్శకునిగా ఈ సినిమాకు సంగీతం అందించాడు . బట్ ఈ క్రమంలో సినిమాకి సంబందించిన పాటలను డిసెంబర్ 24 న విడుదల చేయాలనీ ,సినిమాను వచ్చే సంక్రాంతి కి జనవరి 1 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు .

“జై సింహ” సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉందని నిర్మాత అన్నారు. మరొక పక్క అజ్ఞాత వాసి సినిమా ఆడియో వేడుక రంగరంగ వైభవంగా జరగగా తమ హీరో కూడా సంక్రాంతికి వస్తున్నా ప్రమోషన్ లు లేవు అని ఫీల్ అవుతున్న నందమూరి ఫాన్స్ కి మొత్తం మీద బాలయ్య రంగంలోకి దిగి స్పెషల్ గా ప్రమోషన్ ల మీద దృష్టి పెట్టడం తో ఫుల్ ఖుషీ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here