క్రిస్టియన్ హీరోయిన్ ముస్లిం యువతి అయ్యింది ..

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు… ఈ సామెత హీరోయిన్ అమలాపాల్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది మనకు. సినిమాలతో కాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ అమలాపాల్ తమిళ డైరెక్టర్   విజయ్ ని ప్రేమించి వివాహం చేసుకొని ఆపై సినీ కెరీర్ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం మతసామరస్యం కలిగిన ప్రేమకథా చిత్రంలో నటించనుంది.స్వతహాగా అమలాపాల్ క్రస్తవ మతానికి చెందింది అయినా తాజాగా తాను చేయబోయే పాత్ర ముస్లిం యువతి పాత్రలో నటించనుంది.
ఈ క్రమంలో హిందూ యువకుడు ప్రేమలో పడుతుందట. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం కోనసీమ జిల్లాలో జరుగుతుంది  కథ మాత్రం యునివర్సల్ ఎప్పీల్ కలిగియుంటుందట. అందుకే మెయిన్ హీరోయిన్ పాత్రకు అమలాపాల్ ను ఎంచుకున్నారని టాక్ నడుస్తుంది.అమలాపాల్ పెళ్ళి టైం లో పెద్ద పెద్ద హీరోలతో వచ్చిన అవకాశాలను జారవిడుచుకుంది ఇప్పుడు మాత్రం ఇలా కొత్త కొత్త డైరక్టర్లతో కొత్త కొత్త హీరోలతో చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకేమరి.. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here