వివేక్ ఒబెరాయ్ ను విలన్ ను చేసేస్తున్న చెర్రీ!

రక్తచరిత్ర సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. ఎక్కడ మంచి అవకాశం వచ్చినా నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అలా.. రీసెంట్ గా తమిళంలో అజిత్ తో కలిసి వివేగం అంటూ.. సందడి చేశాడు. విలన్ గా.. తమిళుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు.. మరోసారి తెలుగు తెరపై మెరిసేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ రంగ స్థలం సినిమా చేస్తున్నాడు. తర్వాత.. బోయపాటి దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా కోసమే.. విలన్ గా వివేక్ ఒబెరాయ్ పేరును పరిశీలిస్తున్నారట. ఇది కుదిరితే.. హిందీలోనూ డబ్ చేసి సినిమా విడుదల చేస్తే.. మంచి రిజల్ట్ రావొచ్చని అంచనా వేస్తున్నారట.

ఈ ప్రపోజల్ ను.. వివేక్ ఒబెరాయ్ కన్ఫమ్ చేయడమే మిగిలిపోయిందని.. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. సినిమాలో మరో కీ రోల్ కు.. రమ్యకృష్ణను కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. చూస్తుంటే.. మెగా కాంబోలో.. మరో డిఫరెంట్ మూవీతో రామ్ చరణ్.. సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోందని మెగా అభిమానులు కూడా ఆనందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here