హిందూపురం లో బాలయ్య కి కష్టమే ..

గత సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి బాలకృష్ణ కు పోటీగా వైసీపీ అభ్యర్థిగా నిలబడిన నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో తన ఓటమికి కారణాలు చెప్పారు నవీన్ నిశ్చల్ ఈ క్రమంలో బాలకృష్ణ పై సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నియోజవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా నియోజకవర్గంలో కనబడుతున్న అభివృధి  నా హయాంలో జరిగినది ఇప్పుడు కూడా కనబడుతుంది అని వ్యాఖ్యానించారు.

తాను చిల్లర రాజకీయాలు చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యానని పరోక్షంగా బాలయ్యని ఉద్దేశించి అన్నారు. హిందూపురం నియోజకవర్గం ప్రజలు మరోసారి ఎమ్మెల్యేను అవకాశమిస్తే  ఇరవై ఏళ్లపాటు మరెవరికి అవకాశం ఇవ్వనని అన్నారు. అంతలా అభివృద్ధి చేసి చూస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here