శ్రీ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్న నాగబాబు స్పందించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హీరోయిన్ శ్రీరెడ్డి మీడియాలోకి వచ్చి పవన్ కళ్యాణ్ నిఅతని తల్లిని తీవ్రంగా దూషించింది. దీంతో నాగబాబు చాలా తీవ్రంగా స్పందించారు..తాజాగా ఫిలింనగర్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించరు…నాగ బాబు మీడియాతో మాట్లాడుతూ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏదైనా స‌మ‌స్య ఉంటే పోలీసుల‌ను, కోర్టును సంప్ర‌దించాల‌ని శ్రీ‌రెడ్డికి ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించ‌డం త‌ప్పా అంటూ ప్ర‌శ్నించారు.
శ్రీ‌రెడ్డి ఆడ పిల్ల‌ని, త‌న‌ను ఏమీ అనొద్దంటూ త‌న త‌ల్లి త‌మ‌కు చెప్ప‌డంతోనే.. శ్రీ‌రెడ్డిని వ‌దిలేశామ‌ని, లేకుంటేనా..!! అంటూ నాగ‌బాబు శ్రీ‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కనుక అత‌ని అభిమానుల‌కు ఒక్క పిలుపు ఇస్తే చాలు.. వారంద‌రూ క‌దిలొస్తార‌ని, శ్రీ‌రెడ్డి చూస్తార‌న్నారు నాగ‌బాబు. ఇండస్ట్రీ లో ఉండే గొడవలు చాలా చిన్నవని అన్నారు. కూర్చుని మాట్లాడుకునే పోయే సమస్యలను మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీ పరువు తీసివేయడం మంచిది కాదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here