పవన్ కళ్యాణ్ కోసం మాధవీలత చేసిన దీక్ష భగ్నం

తాజాగా ఇటీవల శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది హైదరాబాదు నగరంలో ఫిలిం చాంబర్ ఎదుట మౌన దీక్ష చేపట్టింది నటి మాధవి లత. ఉదయం నుండి మాధవీలత ఫిలిం ఛాంబర్ ఎదుట కూర్చుంది. ఈ దీక్షలో మరికొంతమంది కూడా పాల్గొన్నారు.

ఈ దీక్షలో అందరూ నల్లబ్యాడ్జీలు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు దీక్ష జరుగుతున్న ప్రాంతానికి వచ్చి మాధవీలత చేస్తున్న దీక్షను భగ్నం చేశారు. ఆమెను అక్క‌డి నుంచి లేచి వెళ్లిపోమ‌ని కోరినా, మాధ‌వీల‌త విన‌క‌పోయే స‌రికి.. ఆమెను బంజారా హిల్స్ పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు. ”దీక్ష‌లో ఎలాంటి గొడ‌వ‌లూ జ‌ర‌గ‌వు. ఇది కాస్టింగ్ కౌచ్‌కి నిర‌స‌న‌గా చేస్తున్న దీక్ష మాత్ర‌మే. ఒక‌వేళ గొడ‌వ జ‌రిగితే.. దీక్ష ఆపేస్తా. క‌నీసం పోలీస్ స్టేష‌న్‌లో అయినా దీక్ష చేసుకోనివ్వండి” అని మాధ‌వీల‌త పోలీసుల్ని అభ్య‌ర్థించారు. పోలీసులు మాత్రం మాధవీలత చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోకుండా దీక్షను భగ్నం చేసి స్టేషన్ కు  తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here