భరత్ అనే నేను సినిమాల్లో లవ్ ట్రాక్ అద్భుతం!

మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది భరత్ అనే నేను సినిమా. ఈ వేసవిలో విడుదలవుతున్న రెండో అతిపెద్ద సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడం మహేష్ అభిమానులను ఎంతగానో సంతోషించే విషయం గా పరిగణించడం జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో డైరెక్టర్ కొరటాల శివ లవ్ ట్రాక్ ని అద్భుతంగా తెరకెక్కించాడట. ఓ ముఖ్య‌మంత్రి ప్రేమ‌లో ప‌డితే.. ఎలా ఉంటుందో.. ఇందులో చూపించే అవ‌కాశం వ‌చ్చింది కొర‌టాల‌కు. సీఎం రొమాన్స్ హ‌ద్దు దాట‌కూడ‌దు. అదే స‌మ‌యంలో ల‌వ్ ఫీల్ మిస్స‌వ్వ‌కూడ‌దు. అందుకే… హీరోయిన్ వైపు నుంచి న‌రుక్కొచ్చాడ‌ట‌. ల‌వ్ ట్రాక్‌లో హీరోయిన్ పాత్రే కీల‌క‌మ‌ని, కైరా ఆద్వానీ క్యారెక్ట‌రైజేష‌న్‌ని కొర‌టాల బాగా మ‌లిచాడ‌ని తెలుస్తోంది.
సీఎంగా మ‌హేష్ గ‌ద్దె దిగ‌డానికి కూడా….కైరా పాత్రే కీల‌కం అవుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. సినిమాలో వీరిద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ అవుట్ పుట్ బాగా వచ్చిందని సమాచారం. ఈ సినిమాతో కైరా అద్వానీ మరిన్ని అవకాశాలు ఇండస్ట్రీలో దక్కించుకుంటుంది అనే ధీమా వ్యక్తంచేస్తున్నారు సినిమా యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here