ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన నాగ‌బాబు..

సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, మెగా బ్ర‌దర్ నాగ‌బాబు మ‌ధ్య మాట‌కు మ‌ట న‌డుస్తున్నాయి. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీపై ప్ర‌కాష్ రాజ్ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో నాగ‌బాబు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడి.. ప్ర‌కాష్ రాజ్‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపికి జ‌న‌సేన మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై ఓ ఇంట‌ర్వూలో ప్ర‌కాష్ రాజ్ మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి బీజేపీకి మ‌ద్ద‌తు తెలుప‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. దీనిపై నాగ‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. బీజేపీ, జ‌న‌సేన పొత్తు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా స‌త్తా చాటుతుంద‌న్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని రాజ‌కీయ పార్టీలు నిర్ణ‌యాలు తీసుకుంటాయ‌ని ఆయ‌న అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపికి మ‌ద్ద‌తు తెలుప‌డం వెనుక ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు. ప్ర‌కాష్‌రాజ్‌కు విమ‌ర్శించ‌డం త‌ప్ప హ‌ర్షించ‌డం తెలియ‌ద‌న్నారు. అయితే దేశానికి బీజేపీ, ఏపీకి జ‌న‌సేన‌తోనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా బీజేపీ, జ‌న‌సేన శ‌క్తిని నిలువ‌రించ‌లేర‌న్నారు. మ‌రి దీనికి ప్ర‌కాష్ రాజ్ మ‌ళ్లీ స్పందిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here