ముంబైలో దాడి చేసిన వ్య‌క్తి ఆచూకి తెలిపితే ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా..

ముంబైలో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఘ‌ట‌న జ‌రిగిన ద‌శాబ్దం జ‌రిగినా ఇప్ప‌టికీ ప్ర‌ధాన సూత్ర‌దారుల ఆచూకీ తెలియ‌డం లేదు. దీంతో అమెరికా ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంది.

2008 నవంబరు 26న ముంబైపై ఉగ్ర‌వాదులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడుల్లో 10 మంది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ట్రైన్ స్టేషన్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అజ్మల్ అమిర్ కసబ్ అనే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. కసబ్‌కు ఉరి శిక్ష విధించడంతో పుణేలోని యెరవాడ కేంద్ర కారాగారంలో 2012 నవంబరు 11న ఉరి తీశారు.

ఈ దాడుల్లో సూత్ర‌ధారి సాజిద్ మీర్ త‌ప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయ‌న పాకిస్తాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ల‌ష్క‌రే తోయిబాకు చెందిన వ్య‌క్తే అని అమెరికా చెబుతోంది. 12 సంవ‌త్స‌రాలు అయినా ఈయ‌న ఆచూకి తెలియ‌క‌పోవ‌డంతో అమెరికా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇత‌న్ని ప‌ట్టిస్తే ఐదు మిలియ‌న్ డాల‌ర్లు అంద‌జేస్తామ‌ని రివార్డు ప్ర‌క‌టించింది. 2011లో అమెరికాలోని జిల్లా కోర్టు ఇత‌న్ని దోషిగా తేల్చింది. సాజిద్‌పై ఇంత భారీ రివార్డు ప్ర‌క‌టించ‌డంతో విష‌యం మ‌ళ్లీ చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here