నాగ చైతన్య షేర్ చేసిన…. ‘డోర్ మ్యాట్ ఆఫ్ ది ఇయర్’ని చూశారా..? 

View this post on Instagram

And the door mat of the year award goes to …

A post shared by Chay Akkineni (@chayakkineni) on

కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకు పరిమితమైన విషయం తెలిసిందే. ఇక దాదాపు అన్ని రంగాల సంస్థలు మునుపెన్నడూ లేని విధంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీంతో ఎప్పుడూ ఆఫీసుల్లో కుస్తీలు పడే వారు ఇప్పుడు ఎంచక్కా పొలాల గట్టున ల్యాప్ టాప్ తో వర్క్ చేస్తున్నారు.

దీంతో పెద్దగా మేక్ ఓవర్ పై జనాలు ఆసక్తి చూపించడం లేదు. నైట్ ప్యాంట్, టీ షర్ట్ పై పని కానిచ్చేస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్లు, పార్టీలు లేకపోవడంతో అందరూ జీన్స్ ప్యాంట్లకు గుడ్ బై చెప్తున్నారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించి నటుడు అక్కినేని నాగచైతన్య ఒక ఫన్నీ పోస్టు పెట్టాడు.

ప్యాంటులేని ఇళ్లు (హోం ఈజ్ వేర్ ప్యాంట్స్ ఆర్ నాట్ ) అంటూ లెట‌ర్స్‌తో ఉన్న ఓ డోర్ మ్యాట్‌ని షేర్ చేస్తూ…డోర్ మ్యాట్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఓ క్యాప్ష‌న్‌ను జోడించాడు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మరి ఆ డోర్ మ్యాట్ ఆఫ్ ది ఇయర్ పై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here