చైతూ కి ప్లాప్ ఇచ్చి చైతూ తో పోటీ పడుతున్నాడు

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో దోచేయ్ సినిమా చాలా పెద్ద డిజాస్టర్ గా మారింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఏఎ చిత్రం అంచనాలు అందుకోవడం లో బాగా ఫెయిల్ అయ్యింది. స్వామిరారా తో సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుదీర్ వర్మ ఆ తరవాత నాగ చైతన్య తో సినిమా అంటే చైతూ ఒక సూపర్ హిట్ సాధిస్తున్నాడు అనే అనుకున్నారు అందరూ కానీ సుదీర్ అంచనాలు అందుకోలేక ఫెయిల్ అయ్యాడు. దోచేయ్ తరవాత అతని కెరీర్ క్లోజ్ అనుకున్నారు కానీ తనకి ఫస్ట్ సినిమా ఆఫర్ ఇచ్చిన హీరో నిఖిల్ సిద్దార్థ్ తో మనోడు క్సేవ కంప్లీట్ చేసాడు.

దోచేయ్ సినిమా రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా కేశవ సినిమా గురించి జనాల్లో , డిస్ట్రిబ్యూటర్ లలో ఆసక్తి రేకెత్తించడం లో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. కేశవ సినిమా మే 12 న విడుదల కి సిద్దం చేస్తున్నారు . బాహుబలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మే 19 కి షిఫ్ట్ చేస్తారు. మరి ‘బాహుబలి-2’ ప్రభంజనాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో సుధీర్ తన సినిమాను ‘రారండోయ్..’కు పోటీగా తీసుకొస్తాడేమో చూడాలి.

అదే జరిగితే చైతూకు ఇబ్బంది తప్పదు. ఒకవేళ యధావిధిగా మే 12న విడుదలై.. ‘కేశవ’ అంచనాల్ని అందుకున్నా చైతూ సినిమాకు దాని వల్ల కొంత ఇబ్బందే. చైతన్య ఈ కొత్త సినిమా రారండోయ్ మీద చాలా అసలే పెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here