తెలుగుదేశం లో పుట్టిన ముసలం .. చంద్రబాబు వి అన్నీ అబద్ధాలే .

తెలుగుదేశం పార్టీ కి చెందిన సొంత ఎంపీ శివప్రసాద్ తన సొంత ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు లో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన చంద్రబాబు విధానాల మీద తీవ్రంగా మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ లకి చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని శివప్రసాద్ అనడం షాకింగ్ గా ఉంది. ఏపీ జనాభా లో పాతిక శాతం ఉన్న వారికి న్యాయ జరగకుండా మంత్రి పదవులు వేరేవారికి ఇవ్వడం ఏంటి అంటూ ఆయన సీరియస్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన రెండు కేంద్ర మంత్రి పదవులూ కూడా ఓసీ లేక్ ఇచ్చారు అన్నారు ఆయన. మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలు జరగనేలేదు అనీ ఇదంతా టీడీపీ కట్టుకథ అన్నారు. మేనిఫెస్టోలో 90 శాతం హామీలు నెరవేర్చిన ట్టుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ మిగిలిన 10శాతం హామీలు మాల, మాదిగలవి మాత్ర‌మే మిగిల్చిందో చెప్పాలంటూ శివ‌ప్ర‌సాద్‌ ప్రశ్నించారు. దళితుల భూములు కబ్జా కి గురి అవుతుంటే ప్రభుత్వం సైలంట్ గా ఉంది అంటున్నారు ఆయన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here