నేను ఎప్పటికీ జనసేన లోకి వెళ్ళను – మహేష్

సినిమా స్టార్ లు అందరూ రాజకీయాలలోకి వెళ్ళాలి అని లేదు కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటె మాత్రం అలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు చాలా మంది. ఎన్టీఆర్ దగ్గర నుంచీ పవన్ కళ్యాణ్ వరకూ ఫాలోయింగ్ ని అడ్డం పెట్టుకుని రాజకీయాలలో అడుగు పెట్టినవారే. హీరోగా కాస్తంత ఫేం వస్తే చాలు , హీరోయిన్ గా చరిష్మా ఏర్పడితే చాలు రాజకీయాలలో అడుగు పెట్టచ్చు అనిపించుకునే సీన్ ని దక్షణ భారత దేశం లో మొట్టమొదటి సారిగా తమిళ జనాలు మొదలు పెట్టారు. అందరు కాకపోయినా తమిళనాడు లో కాస్తంత ఫాలోయింగ్ ఉంటె చాలు ఖచ్చితంగా రాజకీయ పీఠం ఎక్కేస్తారు.

నెమ్మదిగా అది మనవాళ్ళదగ్గరకీ సోకింది. మహేష్ బాబు రేసేంట్ ఇంటర్వ్యూ లో పవన్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి మీరు కూడా ఏదైనా పార్టీ పెడతారా లేక అదే పార్టీ లో చేరతారా అని అడిగిన ప్రశ్న కి మహేష్ తనకసలు పాలిటిక్స్ అంటే ఏంటో అవగాహన లేదు అని ఎప్పటికీ తాను రాజకీయలజోలికి వెళ్ళను అని చెప్పేసాడు . జనసేన అనే కాదు ఏ పార్టీ లోకి వెళ్ళను, ఆమాటకొస్తే అసలు రాజకీయాలలోకి వెళ్ళే ఉద్దేశ్యమే లేదు, ” అన్నాడు మహేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here