మ‌హేంద్ర సింగ్ అభిమాని అంటే ఇత‌నే..!

అభిమానం అంటే కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ఉంటారు. అలాంటిదే మ‌హేంద్ర‌సింగ్ ధోనికి ఉన్న అభిమానులు. వీరిలో ప్ర‌త్యేక‌మైన అభిమాని మ‌హ‌మ్మ‌ద్ బ‌షీర్ బొజాయ్ ముద్దుగా చాచా చికాగో అని పిలుస్తారు. పాకిస్థాన్‌లోని క‌రాచీలో పుట్టిన ఈయ‌న‌ షికాగోలో ఉంటున్నారు.

ధోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌డంతో తాను క్రికెట్ చూడ‌టానికి గుడ్‌బై చెప్తాన‌ని ఆయ‌న అన్నారు. మ‌హీరిటైర్ అయ్యిన‌ప్పుడు నేనూ రిటైర్ అవుతాన‌ని ఆయన అన్నారు. ఎవ్వ‌రైనా ఎప్పుడైనా రిటైర్ అవ్వాల్సిందేన‌ని అయితే ధోని చివ‌రి మ్యాచ్ ఆడాల్సింద‌న్నారు. ఇక ఈ అభిమాని అంటే ధోనికి కూడా చాలా ఇష్టం. ధోని రిటైర్ అయిన సంద‌ర్బంగా ఆయ‌న‌పై చూపించిన అభిమానాన్ని బ‌షీర్ పంచుకున్నారు.

2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ పాక్ మ్యాచ్‌కు ఈయ‌న‌కు టికెట్ దొర‌క్క‌పోతే ధోనియే టికెట్ ఇప్పించారు. 2015లో సిడ్నీలో మ్యాచ్ చూస్తుండ‌గా ఎండ బాగా ఉందని.. ఆ స‌మ‌యంలో సురేష్ రైనా వ‌చ్చి ధోని ఇమ్మ‌న్నాడ‌ని క‌ళ్ల‌ద్దాలు ఇచ్చార‌న్నారు. ఇక 2019లో కూడా మ్యాచ్‌కు త‌న‌కు టికెట్ ఇప్పించార‌న్నారు. అప్పుడ‌ప్పుడు త‌న‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటార‌న్నారు. 2018 ఆసికా క‌ప్ సంద‌ర్బంలో ధోని త‌న రూమ్‌కి తీసుకెళ్లి జెర్సీ అందించార‌ని ఆయ‌న గుర్త చేసుకున్నారు.

క‌రోనా స‌మ‌యంలో ఇప్పుడు ధోనిని క‌ల‌వ‌లేక‌పోతున్నాన‌ని బ‌షీర్ అన్నారు. స‌మ‌యం చూసుకుని వెళ్లి ధోనిని క‌లుస్తాన‌ని బ‌షీర్ చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here