సీఎం జ‌గ‌న్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వ‌ర‌ద ప‌ర‌స్థితిపై సీఎం జ‌గన్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఒక్కో ముంపు బాధిత కుటుంబానికి రూ. 2వేలు స‌హాయం అందించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌తో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వ‌ర‌ద ఉదృతిని తెలుసుకున్న సీఎం.. తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు. ముంపు బాదిత కుటుంబాల ప‌ట్ల మాన‌వ‌త్వంతో వ్య‌హ‌రించాల‌ని జ‌గ‌న్ అన్నారు. వ‌ర‌ద బాదితుల‌కు అండ‌గా ఉండాల‌న్నారు. ఇక వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఖ‌ర్చుకు వెన‌కాడొద్ద‌ని జ‌గ‌న్ అన్నారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా భాగ‌స్వామ్యం చేయాల‌న్నారు. స‌మ‌స్య ఉంటే వెంట‌నే స్పందించాల‌న్నారు. ఇక ముంపు ప్రాంతాల్లో జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే చేస్తాన‌న్నారు. మ‌రో మూడు రోజుల్లో క్ర‌మేపీ గోదావ‌రి వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌డుతుంద‌న్నారు. వ‌ర‌ద త‌గ్గ‌గానే పంట న‌ష్టం అంచ‌నా వేయాల‌న్నారు. విద్యుత్‌, స‌మాచార వ్య‌వ‌స్థ‌ల‌ను వేగంగా పున‌రుద్ధ‌రించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. వ‌ర‌ద ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నాలు వేస్తూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు జ‌గ‌న్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here