పెళ్లి త‌ర్వాత బిజీ అయిన నితిన్‌

హీరో నితిన్ పెళ్లి త‌ర్వాత బాగా బిజి అవుతున్నారు. ఆయ‌న తాజాగా చేస్తున్న చిత్రం రంగ్ దే. వెంకి అట్లూరి డైరెక్ష‌న్‌లో రెడీ అవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌. అయితే సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ మీద ఆయ‌న ఫోక‌స్ పెట్టారు.

ఇది పూర్త‌వ్వ‌గానే వెంట‌నే హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అయిన అందాథూన్ రీమేక్ చేస్తున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ స‌మ‌యానికి ఈ సినిమా కూడా దాదాపుగా పూర్త‌య్యేది. అయితే క‌రోనా వ‌ల్ల రంగ్ దే ఇంకా పూర్తి కాలేదు. ఈ నేప‌థ్యంలో రంగ్ దే పూర్త‌వ్వ‌గానే నితిక్ వేరే ప్రాజెక్టుల‌పై ఫోకస్ పెట్ట‌నున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌భ న‌టేష్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ తో ఆమె అంద‌రి దృష్టిలో ప‌డ్డారు. అయితే డిస్కో రాజా త‌ర్వాత ఆమె సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, అల్లుడు అదుర్స్ సినిమాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ నితిన్ సినిమా అవ‌కాశం వెళ్లింది. అయితే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ లేదు. నితిన్ రంగ్ దే కంప్లీట్ అయితేనే ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వ్వ‌నుందో తెలుస్తుంది. డైరెక్ట‌ర్ గాంధీకి కూడా ఈ సినిమా హిట్ అవ్వ‌డం చాలా అవ‌స‌రం. మ‌రి సినిమాను ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here