చిరుపై మోహ‌న్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

మెగాస్టార్ చిరంజీవి గురించి సినీన‌టుడు మోహ‌న్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు మెగాస్టార్ బ‌ర్త్‌డే అన్న విష‌యం తెలిసిందే. దీంతో మోహ‌న్ బాబు త‌న‌దైన శైలిలో స్పందించారు.

చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్బంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల పండుగ కొన‌సాగుతోంది. ఉద‌యం నుంచి సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అందరూ హ్యాపీ బ‌ర్త్‌డే టు యు మెగాస్టార్ అంటూనే ఉన్నారు. తాజాగా హీరో మోహ‌న్ బాబు కూడా చిరుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. మోహ‌న్ బాబు ఏం చేసినా ఓ స్టైల్ ఉంటుంద‌న్న‌ది తెలిసిందే.

చిరు బ‌ర్త్‌డేకు ట్విట్ట‌ర్‌లో ఆయన విశెష్ తెలిపారు. చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను అని మోహ‌న్ బాబు ఓ ఫోటో షేర్ చేశారు. ఈ ట్వీట్‌ను వేల మంది లైక్‌లు కొట్ట‌గా రిప్లైలు కూడా ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here