హీరో సూర్య కూడా ఫిక్స్ అయ్యారా..

హీరోలు సెట్ చేసిన ట్రెండ్‌ని అభిమానులు ఫాలో అవ్వ‌డం మ‌నం చూశాం. కానీ ఇప్పుడు హీరోలే ఫాలో అవుతున్నారు. అదేందంటే క‌రోనా అంటున్నారు. విష‌యానికొస్తే ఒక్క హీరో ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అవ్వ‌గానే వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఓటీటీ కి సై అంటున్నారు.

ఓటీటీలో నాని వి సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి రెండు రోజులు కూడా కాక ముందే మిగ‌తా హీరోలు క్యూ క‌డుతున్నారు. క‌రోనా దెబ్బ‌కు థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో సెప్టెంబ‌ర్ 5వ తేదీన నాని వి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఇదే బాట‌లో మ‌రికొంద‌రు హీరోలు వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

స్టార్ హీరో సూర్య కూడా ఆకాశం నీ హ‌ద్దురా సినిమాను ఓటీటీ వేదిక‌గా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఎయిర్ డెక్క‌న్ అధినేత గోపీనాథ్ బ‌యోపిక్ అయిన‌ ఈ సినిమాకు సుధా కొంగ‌ర ద‌ర్శ‌కురాలు. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ 30వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక మ‌రో యంగ్ హీరో నితిన్ కూడా త‌న రంగ్‌దే సినిమాను కంప్లీట్ చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని టాక్‌. ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌గానే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఓటీటీ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అప్ప‌టికి థియేట‌ర్లు ఓపెన్ అయితే ఓకే.. లేదంటే ఓటీటీ వైపే ఈయ‌న కూడా అడుగులు వేస్తార‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here