బిగ్‌బాస్ షోలో అమ్మమ్మ‌..?

బిగ్‌బాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చిన షో. మొద‌ట్లో ఎలాగున్న ఇప్పుడు మాత్రం జ‌నాలు బిగ్‌బాస్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. ఇప్పుడు బిగ్‌బాస్ 4 సరికొత్త హంగుల‌తో మ‌న‌ముందుకు రాబోతోంది.

బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్ల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డం లేదు కానీ పుకార్లు మాత్రం బానే వ‌స్తున్నాయి. షో ప్రారంభం అయ్యే స‌రికి బిగ్‌బాస్ గురించి ఆలోచించి చాలా మంది పిచ్చెక్కిపోయేలా ఉన్నారు. యూ ట్యూబ్‌లో బిగ్‌బాస్ గురించి ఒక్క వార్త క‌నిపిస్తే చాలు వెంట‌నే ఓపెన్ చేసేస్తున్నారంటే ఎంత‌లా వెయిట్ చేస్తున్నారో చూడండి.

లాక్ డౌన్ పుణ్య‌మాని బిగ్‌బాస్ షో మ‌రింత రేటింగ్‌ను సొంతం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే ఈ సారి ఓ ఇంట్ర‌స్టింగ్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ షోలో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. ఆమె ఎవ‌రో కాదు గంగ‌వ్వ‌. యూట్యూట్ లో గంగ‌వ్వ పేరు తెలియ‌ని వారుండ‌రు. త‌న స్టైల్ బాష‌తో ప‌ల్లెటూరి ప్రేక్ష‌కుల‌ను ఇట్టే ఆక‌ట్టుకున్నారు గంగ‌వ్వ‌. ఇప్పుడు ఈమె కూడా బిగ్‌బాస్ 4 లో క‌నిపిస్తార‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. గంగ‌వ్వ వ‌య‌స్సు చాలా ఎక్కువ కాబ‌ట్టి ఈ వ‌య‌స్సు వారిని షోలోకి ప్ర‌వేశం క‌ల్పిస్తారా అన్న‌ది డౌట్‌. ఒక వేళ గంగ‌వ్వ వ‌స్తే మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ సూప‌ర్‌గా ఉంటుంది. మ‌రి గంగ‌వ్వ నిజంగా బిగ్‌బాస్ 4లో ఉంటుందో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here