75 కోట్ల దోమ‌ల‌ను త‌యారు చేసిన అమెరికా..

కుక్క‌లు, పిల్లులు, ప‌క్షులు పెంచుకోవ‌డం మ‌న‌కు అల‌వాటు. కానీ అమెరికా విచిత్రంగా దోమ‌లను పెంచింది. అదీ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 75 కోట్ల దోమ‌ల‌ను అమెరికా పెంచింది. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. విష‌య‌మేంటో తెలుసుకోండి.

అమెరికా విష‌జ్వరాల‌ను అరిక‌ట్టేందుకు ఈ దోమ‌లు త‌యారు చేస్తోంది. ఫ్లోరిడాలోని ఫ్లోరిడా కీస్ ద్వీపాల్లో ఈ దోమ‌ల‌ను వ‌దిలేందుకు అధికారులు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చికున్‌గున్యా, ఎల్లో ఫీవ‌ర్ వంటి విష‌జ్వ‌రాలు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తాయి. ఇప్పుడు క‌రోనా ఉంది కాబ‌ట్టి మిగ‌తా జ్వ‌రాలు మ‌న‌కు అంత క‌న‌ప‌డటం లేదు. క‌రోనా లేక‌పోతే విష‌జ్వ‌రాల గురించే మ‌నం మాట్లాడుకునే వాళ్లం.

మొత్తానికి ఈ విష‌జ్వ‌రాల‌ను అరిక‌ట్టాలంటే ఏజిప్టి అనే ఆడ దోమ‌లను అరిక‌ట్టాల్సి ఉంటుంది. దీంతో ఫ్లోరిడాలో బ్రిటన్‌కు చెందిన ఆక్సిటెక్ అనే కంపెనీలోని ల్యాబ్‌లో జ‌న్యుప‌రంగా వృద్ది చేయ‌బ‌డిన 75 కోట్ల‌ ఈ దోమ‌ల‌ను పెంచారు. వీటికి OX5034గా పేరు కూడా పెట్టారు. ఈ దోమ‌ల‌న్నింటినీ తీసుకెళ్లి ఫ్లోరిడా కీస్ ద్వీపంలో వ‌దిలేస్తారు. ఈ మ‌గ దోమ‌ల‌న్నీ అక్క‌డి ఆడ దోమ‌ల‌తో సంయోగం జ‌రిపుతాయి.. ఈ క్ర‌మంలో కొంత స‌మ‌యానికంతా ఆడ దోమ‌లు చ‌నిపోతాయి.

ఈ విధంగా భ‌యంక‌ర‌మైన ఆడ దోమ‌ల‌ను అరిక‌ట్టాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం కొత్త త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే ఇది ఇప్పుడే మొద‌టి సారి కాదు. గ‌తంలో బ్రెజిల్ కూడా ఇలాంటి ప్ర‌యోగ‌మే చేసి విజ‌య‌వంతం అయ్యింది. ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here