పండ‌గ‌చేసుకుంటున్న ఫ్యాన్స్‌..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌ని అన్నివిధాలా ఆక‌ట్టుకునే మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్ అంతా బ‌ర్త్ డే మూడ్‌లో ఉంటే చెప్పిన స‌మ‌యానికి దీన్ని రిలీజ్ చేసి అంద‌రినీ అబ్బుర‌ప‌రిచారు.

చిరు బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఆచార్య మూవీ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తార‌ని ముందే ప్ర‌క‌టించారు రామ్‌చ‌ర‌ణ్‌. అంతా రెడీ చేసుకొని ఇందుకోసం వెయిట్ చేస్తున్నాన‌ని మూడు రోజుల క్రిత‌మే చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. అయితే ఏం రిలీజ్ చేస్తారో ఎలా ఉంటుందో అన్న ఆందోళ‌న అంద‌రిలోనూ ఉండింది.

అయితే అభిమానుల అంచ‌నాలకు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ ఉంది. మారుమూల గ్రామంగా ధ‌ర్మ‌స్థ‌లిని చూపించారు. ఆ ఊరికి ఏదో చ‌రిత్ర ఉన్న‌ట్లుగా.. ఆ ఊరు చిరు కోస‌మే ఎదురుచూస్తున్న‌ట్లుగా విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌లో మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది. సైలెంట్‌గా మ్యూజిక్ వ‌స్తుండ‌టంతో ఇంకేమ‌వుతుందో అని చూస్తుండ‌గానే మెగాస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి క‌నిపిస్తున్నారు. అంత‌లోనే మోష‌న్ పోస్ట‌ర్ అయిపోతుంది.

దీన్ని బ‌ట్టి చూస్తే సినిమా మాస్ హిట్ అయ్యేలా క‌నిపిస్తోంది. సినిమా రిలీజ్ అవ్వ‌గానే మెగాస్టార్ అభిమానుల‌కు పండ‌గ వాతావ‌ర‌ణం క‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికీ ఇంకా స‌గం సినిమా మాత్ర‌మే షూటింగ్ పూర్త‌యింది. మ‌రి మిగ‌తా సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో అర్థ కావ‌డం లేదు. సినిమా మాత్రం 2021లో విడుద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ పోస్ట‌ర్ చూశాకా అన్ని రోజులు అభిమానులు ఎలా ఆగుతారో మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here