మోడీ ముందస్తు ఎన్నికల ప్లాన్ .. ప్లాప్ ఆ హిట్ ఆ ?

కేంద్ర ప్రభుత్వం ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సిద్ధంగా ఉంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఇలా ఎన్నికలు నిర్వహించడం వల్ల చేస్తే అయిదేళ్ల దాకా రాజ‌కీయాలే ఉండ‌వ‌ని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండ‌వ‌ని అంచ‌నా అంచనా వేస్తుంది మోదీ ప్ర‌భుత్వం. ఇప్పటికే ఈ విషయం మీద అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పించింది ప్రధాని మోడీ ,అయితే  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని భావించారట మోడీ.

ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల మీద చంద్రబాబు నిర్ణయం ఏమిటి అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ని అడిగారట ప్రధాని మోడీ. దీనికి జవాబుగా సుజనా చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో నేరుగా మీరే మాట్లాడితే బాగుంటుందని ప్రధాని మోడీ కి  సూచించారట సుజన. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ఎలా స్పందిస్తారోనని బిజెపి వర్గాలు కంగారు పడుతున్నాయట. ముందస్తు ఎన్నికలకు  ఒకవేళ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడి అయితే  మోడీ కూడా మంచి ఆఫర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ చంద్రబాబు ఒప్పుకొంటే పోలవరం ప్రాజెక్టు మొత్తం తాము పూర్తి చేస్తామని హామీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అట మోడీ, అంతేకాకుండా రైల్వేజోన్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందట. చంద్రబాబు ఈ విషయం మీద ఏ విధంగా ముందుకెళ్తారు చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here