చంద్రబాబు తో మావల్ల కాదు వామ్మో ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్నావీస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్విజర్లాండ్ రాజధాని దావోస్ కి  పర్యటించడం జరిగింది . ఈ క్రమంలో అక్కడ జరిగిన వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నరు అయితే ఇదే సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్నావీస్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫ‌డ్నావీస్ చంద్రబాబు నాయుడు మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుతో పోటీపడటం మామూలు విషయం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మీద పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే చంద్రబాబు అని. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దపెద్ద వ్యాపార వేత్తలు చంద్రబాబు చేసిన అభివృద్ధికి ఫిదా  అయిపోయారని అన్నారు.

నిన్నమొన్నటిదాకా  దేశంలో పెట్టుబడి పెట్టే కంపెనీలు మొత్తం గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర వైపు క‌న్నెత్తి చూసేవారు. అయితే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పెట్టుబడిదారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు చూస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.దీంతో, ఇప్ప‌టిదాకా మీకంటే ముందున్న మేమ,  ప్ర‌స్తుతం ఏపీతో పోటీప‌డాల్సి వ‌స్తోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనికి చంద్ర‌బాబు న‌వ్వి ఊరుకున్నార‌ట‌. రాష్ట్రం విడిపోయినా నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారంటే మామూలు విషయం కాదని మహారాష్ట్ర సీఎం ఫ‌డ్నావీస్ అన్నారు. మొత్తంమీద చంద్ర‌బాబు డైన‌మిజ‌మ్ మ‌రోసారి ప్రూవ్ అయింది అంటున్నారు ఎన‌లిస్టులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here