పక్కా ప్లాన్ తో ఉన్న మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ప్లాన్ మిద ఉన్నాడు. గత ఏడాది స్పైడర్ సినిమా ఫ్లాప్ కావడంతో తగు జాగ్రత్తలు తిసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో మహేష్ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు మహేష్ బాబు. అలాగే కొరటాల శివ కూడా సినిమాను అదేవిధంగా తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన శ్రీమంతుడు భారీ హిట్ అవడంతో ప్రస్తుతం ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈమధ్యే విడుదలైన ‘భరత్ అనే నేను’ ఫస్ట్ ఒథ్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది.పూర్తిగా ఆంధ్ర  రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. భరత్ అనే నేను షూటింగ్ పూర్తికావస్తున నేపథ్యంలో మహేష్ బాబు తన 25వ సినిమా మిద దృష్టి పెట్టాడు. ఈ సినిమాను మహేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తిసుకున్నాడు. మహేష్ 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాను కూడా మహేష్ బాబు ఈ  సంవత్సరం చివరికల్లా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను అంతా దర్శకుడు పక్కా ప్లాన్ తో సెట్ చేసుకుంటున్నాడు. ఎలాగైనా ఈ  సినిమాతో కూడా మహేష్ మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. మరోపక్క ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here