చంద్రబాబు ఎదుట తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి ప్రస్తుతం బాడ్ టైం నడుస్తున్నట్లుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం అంటూ.. అక్కడ ఫోటోలకు ఫోజులిచ్చి కేవలం ప్రచార ఆర్భాటానికి తప్ప చంద్రబాబు రాష్ట్రానికి మేలు చేయాలని చిత్తశుద్ధితో వెళ్లలేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోనే కాక సొంత పార్టీలోని కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా స్వరాలు బయటపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు ఒకరి తరువాత ఒకరు చంద్రబాబుపై  ఎదురుతిరుగుతున్నారు.
ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి టీడీపీ సర్కారు మీద విరుచుకుపడ్డారు. సభలో మాట్లాడుతున్న రానున్న నాలుగు ఏళ్ళలో రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు ఎలా చేస్తారు.మీదగ్గర ఏవిధమైన ప్రణాళికలు ,వుహ్య రచనలు ఉన్నాయి .ఎటువంటి కార్యక్రమాలను అమలు చేస్తారు ఇలా తదితర అంశాల గురించి ఏకంగా అసెంబ్లీ సాక్షిగా బాబు ఎదుటే టీడీపీ సర్కారుపై ఎదురుతిరిగారు.
అయితే గత కొంతకాలంగా ఎంతో తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే మోదుగుల త్వరలోనే వైసీపీ పార్టీ మారతారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆయన అసెంబ్లీ సాక్షిగా  ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుటే తిరగబడటం వెనుక ఆయన త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈయనే ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here